డీఏ పెంపు.. ఈ సారి ఎంత ఉంటుందంటే? | Central Government Is Likely To Announce A DA Hike For Its Employees And Pensioners Before Holi | Sakshi
Sakshi News home page

DA Hike: డీఏ పెంపు ప్రకటన త్వరలో..: ఈ సారి ఎంతంటే?

Published Fri, Mar 7 2025 6:11 PM | Last Updated on Fri, Mar 7 2025 7:01 PM

Central Government Is Likely To Announce A DA Hike For Its Employees And Pensioners Before Holi

హోలీకి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) & డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం చేకూరుతుంది.

ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు (జనవరి, జూలై) డీఏను సమీక్షిస్తుంది. జనవరి సవరణ సాధారణంగా మార్చిలో జరిగితే.. జూలై సవరణ అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రకటిస్తారు. అయితే ఈ సారి డీఏ పెంపు 2 శాతం వరకు ఉండొచ్చని సమాచారం. గత ఏడాది.. కేంద్ర ప్రభుత్వం డీఏను రెండు సార్లు పెంచింది. దీంతో డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. ఆ తరువాత అక్టోబర్​లో 50 నుంచి 53 శాతానికి పెరిగింది. ఇప్పుడు వస్తున్న ఊహాగానాలు నిజమైతే.. డీఏ 53 శాతానికి చేరుతుంది.

మార్చి 5న న్యూఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఎటువంటి చర్చ జరపలేదని తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావడానికి హోలీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలను సమీక్షించడానికి 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం జనవరి 2025లో ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!

కేంద్రం 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటించినప్పటి నుంచి.. జీతం, పెన్షన్లలో సవరణలకు సంబంధించిన ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ 8వ వేతన సంఘం తన సిఫార్సులను సంకలనం చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులను సంప్రదించి తుది ప్రతిపాదనలు చేసే ముందు వారి ఆందోళనలను అర్థం చేసుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement