Center PLI Scheme Is A Failure: Former RBI Governor Raghuram Rajan - Sakshi
Sakshi News home page

ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్‌ సంచలన వ్యాఖ్యలు

May 31 2023 10:51 AM | Updated on May 31 2023 11:37 AM

Center PLI schemeis a failure Former RBI Governor Raghuram Rajan - Sakshi

సాక్షి, ముంబై:  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ)  పథకంపై  సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్‌ఐ ఫెయిల్యూర్‌ పథకం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే భారతదేశంలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ ఎగుమతులపై ఆందోళన వ్యక్తం చేశారు.  గతంలో కూడా రాజన్‌  పీఎల్‌ఐ పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన  సంగతి గమనార్హం. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?)

దీనికి సంబంధించి ‘ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా?’ అనే పేరుతో వెల్లడైన పరిశోధనా నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ్‌ రాజన్‌ షేర్‌ చేశారు.  దేశంలో నిజమైన తయారీ కంటే దిగుమతి అయిన విడిభాగాల అసెబ్లింగ్‌ ద్వారా వృద్ధి సాగుతోందని విమర్శించారు. మొబైల్‌ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ దేశీ తయారీ ఉత్పత్తులకు సబ్సిడీ ఇస్తు న్న ఈ  స్కీమ్‌ సమర్థతను ప్రశ్నించారు.  భారతదేశంలో ఫోన్‌ను పూర్తి చేయడానికి మాత్రమే సబ్సిడీ  ఇస్తోంది తప్ప, భారతదేశంలో తయారీ విలువ జోడింపునకు కాదనీ,  ఇదే ఈ పథకంలోని  ప్రధాన లోపమన్నారు. (Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! జూన్‌ 1 తర్వాత పెరగనున్న ధరలు)

భారతదేశంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో మొత్తం మొబైల్ ఫోన్ దిగుమతిపై సుంకాలను పెంచింది. అలాగే 2020లో మొబైల్ ఫోన్‌ల స్థానిక ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం పీఏల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. 4 శాతం నుండి 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ ప్రోత్సాహకం ఐదేళ్లపాటు వర్తిస్తుంది.దేశంలో తయారీ సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన ఉద్దేశ్యంగా వివిధ రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల పీఎల్‌ఐ స్కీమ్‌లను కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ స్కీమ్‌ల అమలుతీరును వివరిస్తూ రాజన్‌తో పాటు మరో ఇరువురు ఆర్థికవేత్తలు రాహుల్‌ చౌహాన్‌, రోహిత్‌ లంబాలు ఈ రీసెర్చ్‌ నోట్‌ను రూపొందించారు. భారతదేశం నిజంగా మొబైల్ తయారీ దిగ్గజం కాలేదని  వీరు వాదించారు. చౌహాన్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లోని ఫామా-మిల్లర్ సెంటర్‌లో పరిశోధనా నిపుణుడు, లాంబా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ ఎవరిదో తెలుసా?)

పీఎల్‌ఐ స్కీంతో పెరిగిన  ఎగుమతులు సీఈఏ ప్రకటన
ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) గత నెలలో భారతదేశంలో మొబైల్ ఫోన్ ఎగుమతులను ప్రకటించింది. 2022లోని నమోదైన  45,000 కోట్ల నుండి 2023లో  90,000 కోట్లను అధిగమించాయని తెలిపింది. దీనికి పీఎల్‌ఐ స్కీం ప్రధానమని ప్రకటించింది. 

కాగా గతంలోనే పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన రాజన్‌  స్మార్ట్‌ఫోన్ల, ఉత్పత్తి ధరలపై కొన్ని  ఉదాహరణలుకూడా ఇచ్చారు. ఏప్రిల్ 2018లో మొబైల్ దిగుమతులపై కస్టమ్ సుంకాలు 20 శాతంగా పెంచారనీ, ఇది తక్షణమే దేశీయ ధరలపెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు.  తయారీదారులు ఇండియన్‌ కస్టమర్లపైనే భారాన్ని మోపు తారని కూడా చెప్పారు.  ఉదాహరణకు, ఐఫోన్‌ 13 ప్రొ మ్యాక్స్‌  అమెరికాలో చికాగోలో పన్నులతో సహా రూ. 92,500లోపు అందుబాటులో ఉంటే ఇదే ఫోన్‌ ఇండియాలో దాదాపు 40 శాతం పెరిగి రూ.1,29,000గా ఉంటుందని లెక్కలు చెప్పిన సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement