
బ్రిటిష్ బ్రాండ్ 'బీఎస్ఏ మోటార్‌సైకిల్స్' తన సరికొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650, బీఎస్ఏ బాంటమ్ 350 లను ఆవిష్కరించింది. 1861 నాటి వారసత్వం కనిపించేలా వీటిని డిజైన్ చేయడం జరిగింది.
బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650
కొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 క్లాసిక్ 652సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ DOHC ఇంజిన్ ద్వారా 45 పీఎస్ పవర్, 55 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 41mm టెలిస్కోపిక్ ఫోర్కులు, 5-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీ లోడ్‌తో కూడిన ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఇందులో ఉన్నాయి.
థండర్ గ్రే, రావెన్ బ్లాక్, విక్టర్ యెల్లో అనే మూడు రంగులలో లభించే ఈ బైక్.. డ్యూయల్ ఛానల్ ABSతో బ్రెంబో బ్రేక్‌లు, గ్రిప్పీ పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్టీఆర్ టైర్లు, వైర్ స్పోక్ అల్లాయ్ రిమ్ వంటివి పొందుతుంది. 12 లీటర్ ఇంధన ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 218 కేజీలు.
బీఎస్ఏ బాంటమ్ 350
బీఎస్ఏ బాంటమ్ 350 నిజమైన క్లాసిక్‌కు నిదర్శనం.ఇది 334 సీసీ లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజిన్ కలిగి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 7750 rpm వద్ద 29PS పవర్ 6000rpm వద్ద 29.62Nm టార్క్ అందిస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.
రౌండ్ హెడ్‌లైట్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, వంపుతిరిగిన రియర్ ఫెండర్ కలిగిన ఈ బైక్ అవలోన్ గ్రే, ఆక్స్‌ఫర్డ్ బ్లూ, ఫైర్‌క్రాకర్ రెడ్, బారెల్ బ్లాక్, విక్టర్ యెల్లో వంటి రంగులలో లభిస్తుంది.