
సెప్టెంబర్ 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెంచింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల మోడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీ ఆటుపోట్లు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఒత్తిళ్లు, పెరిగిన రవాణా వ్యయాల కారణంగా ధరలు పెంచాల్సి వచి్చందని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పవాహ్ తెలిపారు. ప్రస్తుత పండుగ సీజన్‌లో మరిన్ని నూతన మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు. ఈ జనవరి 1, ఏప్రిల్ 1 తర్వాత 2025లో కంపెనీ కార్ల ధరలు పెంచడం ఇది మూడోసారి. బీఎండబ్ల్యూ ఇండియా రూ.46.9 లక్షలు మొదలుకొని రూ.2.6 కోట్ల లోపు ధర కలిగిన మోడళ్లు విక్రయిస్తుంది.