దేశమంతా ఒకే ధరకు ఈ కారు! | BMW i7 Ex Showroom Price Now Includes Registration And GST, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

దేశమంతా ఒకే ధరకు ఈ కారు!

May 28 2025 9:54 AM | Updated on May 28 2025 11:02 AM

BMW i7 Ex Showroom Price Now Includes Registration and GST

బీఎండబ్ల్యూ ఇండియా తన ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ఐ7 కారును దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఎక్స్‌-షోరూమ్‌ ధర(రూ.2.05 కోట్లు)కు అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో రిజిస్ట్రేషన్‌ ఫీజు, జీఎస్‌టీ, కాంపెన్సేషన్‌ సెస్‌(రాష్ట్రాల ఆదాయాల భర్తీ కోసం ఉద్దేశించినది) ఉంటాయి.

కొత్త ధరల ప్రకారం, కస్టమర్లు బీఎండబ్ల్యూ ఐ7కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఖర్చును చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీయే చెల్లిస్తుంది. కస్టమర్లు బీమా, టీసీఎస్‌(మూలం వద్దే పన్ను వసూలు), స్థానిక సెస్‌లను మాత్రమే చెల్లించాలి. ‘‘రిజిస్ట్రేషన్‌ పన్నులు ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఇది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ పరిస్థితి కొనుగోలుదారుల్లో అనిశ్చితిని సృష్టిస్తుంది. దీన్ని అధిగమించేందుకు దేశమంతా ఒకే ధరకు వాహనాన్ని అందిస్తున్నాము’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా అధ్యక్షుడు విక్రమ్‌ పావా తెలిపారు.

ఇదీ చదవండి: ధర ఎక్కువైనా.. మూడు లక్షల మంది కొనేశారు

కర్ణాటక, మహారాష్ట్రలో లేదా మరే ఇతర రాష్ట్రంలో కస్టమర్‌ ఉన్నా, రిజిస్ట్రేషన్‌ పన్నులో ఉన్న తేడాతో సంబంధం లేకుండా అందరికీ ఒకే ధరకు వాహనం లభిస్తుందన్నారు. కస్టమర్‌ కేంద్రీకృత సేవలపై మరింత దృష్టి సారించడంతో పాటు ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వినియోగాన్ని ప్రోత్సహించడం తమ ముఖ్య ఉద్దేశమని పావా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement