లింక్డ్‌ఇన్‌పై అసంతృప్తి.. భవిష్ అగర్వాల్ ట్వీట్ వైరల్ | Sakshi
Sakshi News home page

లింక్డ్‌ఇన్‌పై అసంతృప్తి.. భవిష్ అగర్వాల్ ట్వీట్ వైరల్

Published Thu, May 9 2024 7:14 PM

Ola's Bhavish Aggarwal Slams LinkedIn, Tweet Viral

ఓలా సీఈఓ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో లింక్డ్‌ఇన్‌ను విమర్శించారు. పాశ్చాత్య దేశాల టెక్నలాజిలు భరతదేశంలో వ్యాపిస్తున్నాయి. ఇందులో లోపాలు కూడా కూడా ఉన్నయని వివరించారు. అందుకే భారత్ సొంత టెక్నాలజీని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.

లింక్డ్‌ఇన్‌ ఏఐ బాట్‌లో 'భవిష్ అగర్వాల్' ఎవరు అని సెర్చ్ చేస్తే.. వచ్చిన ఫలితంలో చాలా వరకు సర్వనామాలకు సంబంధించిన దోషాలు ఉన్నయని భవిష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

దీనిపైన లింక్డ్‌ఇన్‌ కూడా స్పందించింది. ఇది ప్రొఫెషనల్ కమ్యూనిటీ పాలసీలకు వ్యతిరేఖంగా ఉందని లింక్డ్‌ఇన్ నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్నారు. నిజానికి భారత్ సొంత టెక్నాలజీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల టెక్నాలజీలను గుడ్డిగా నమ్మితే ఇలాంటి దోషాలే వస్తాయి. దీనిని యూజర్స్ నమ్మే ప్రమాదం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement