టీసీఎస్‌‌ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసిందెవరో తెలిసి అవాక్కయిన పోలీసులు!

Bengaluru TCS Campus Bomb Hoax Call - Sakshi

బెంగళూరు టీసీఎస్ ఆఫీసుకు ఈ రోజు (మంగళవారం) ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే అక్కడున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ఉద్యోగి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్ చేసింది. క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఆఫీసుకు చేరుకున్నారు. ఆఫీసు మొత్తం వెతికినప్పటికీ అక్కడ బాంబు వంటివి లేదని నిర్థారించారు.

ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి హుబ్లీకి చెందిన కంపెనీ మాజీ మహిళా ఉద్యోగి అని తెలిసింది. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నట్లు సమాచారం. కంపెనీ గతంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల ఈ పని చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్‌

ఈ ఏడాది మేలో ఒకసారి గుర్తుతెలియని వ్యక్తి హైదరాబాద్‌లోని టిసిఎస్ కొండాపూర్ క్యాంపస్‌కి ఫోన్ చేసి బాంబ్ పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అక్కడ పనిచేసే సుమారు 1500 మంది ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. కానీ ఇది ఫేక్ కాల్ అని తెలుసుకున్న తరువాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సంఘటన తరువాత మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top