
ప్రతి నెలా చాలా మందికి ఏదోఒక విషయమై అప్పు అవసరమవుతూ ఉంటుంది. ఇందు కోసం ఎక్కువ మంది బ్యాంకుల్లో పర్సనల్ లోన్లను ఆశ్రయిస్తుంటారు. మీకు కూడా ఈ నెలలో పర్సనల్ లోన్ తీసుకుంటుంటే.. బ్యాంకును ఎంచుకునే ముందు, వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను పోల్చుకుని ఆ తరువాత, ఏది తక్కువ వడ్డీ రేటుతో రుణం అందిస్తుంటే దానిని ఎంచుకోవచ్చు.
పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లతో పాటు ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది కూడా రుణం తీసుకుంటున్నప్పుడు మీ ఆర్థిక భారాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఛార్జీలు మొత్తం వ్యవహారాన్ని ఖరీదైనదిగా చేస్తాయి. ఈ నెలలో కొన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పర్సనల్ లోన్లపై ఎంత మేర వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయో ఇక్కడ తెలుసుకోండి..
ప్రభుత్వ బ్యాంకులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): ఈ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు సంవత్సరానికి 10.05 నుండి 15.05 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ఈ రేట్లు 15 ఆగస్టు 2025 నుండి అమల్లోకి వచ్చాయి. పర్సనల్ లోన్ పై ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.1,000 నుంచి రూ.15,000 వరకు ఉంటాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇది పర్సనల్ లోన్లపై సంవత్సరానికి 10.75% నుండి 14.45% వరకు వడ్డీని వసూలు చేస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ ప్రభుత్వ బ్యాంకు సంవత్సరానికి 10.40 నుండి 15.75 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది.
ప్రైవేట్ బ్యాంకులు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు సంవత్సరానికి 9.99 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. అలాగే రూ .6,500 ప్రాసెసింగ్ ఛార్జీలతో పాటు జీఎస్టీని వసూలు చేస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్: ఇది సంవత్సరానికి 10.60% నుంచి 16.50% పరిధిలో వడ్డీని వసూలు చేస్తుంది. ఇక ప్రాసెసింగ్ ఛార్జీలు రుణ మొత్తంలో 2 శాతం వరకు, వర్తించే పన్నులు ఉంటాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్: వడ్డీ రేటు ఛార్జీలు సంవత్సరానికి 9.98 శాతం నుండి ప్రారంభమవుతాయి. ప్రాసెసింగ్ ఫీజు 5 శాతం వరకు ఉంటాయి. పన్నులు అదనం.
ఫెడరల్ బ్యాంక్: ఇది సంవత్సరానికి 11.99 నుండి 18.99% వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు సంవత్సరానికి 3% వరకు ఉంటాయి.