జూలై 2026 సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారులు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఇందులో ప్రాంతీయ పండుగలు, జాతీయ స్థాయి ఆచారాలు, అలాగే ప్రతి వారం వచ్చే వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి.
జూలై 6న మిజోరాంలో ఎంహెచ్ఐపీ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు
జూలై 9న మేఘాలయలో బెహ్ డెయిన్‌ఖ్లామ్ పండుగ కారణంగా బ్యాంకులు పనిచేయవు
జూలై 16న ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో రథయాత్ర, హరేలా వంటి పండుగల కారణంగా బ్యాంక్ సేవలు రద్దు
జూలై 17న మేఘాలయలో యూ తిరోత్ సింగ్ వర్ధంతి
జూలై 18న సిక్కింలో డ్రుక్పా త్షే-జి బౌద్ధ పండుగ
జూలై 22న త్రిపురలో ఖార్చి పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు
ఇవి కాకుండా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. 2026 జూలైలో ఆదివారాలు జూలై 5, 12, 19, 26 తేదీలకు వస్తాయి. అలాగే రెండో శనివారం జూలై 11, నాలుగో శనివారం జూలై 25న కూడా బ్యాంక్ కార్యకలాపాలు ఉండవు. మొత్తం మీద బ్యాంకులకు 12 రోజులు సెలవులన్నమాట.
ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.


