ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే! | Bank Holidays in 2025 April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే!.. ఎందుకంటే?

Mar 28 2025 12:10 PM | Updated on Mar 28 2025 12:16 PM

Bank Holidays in 2025 April

మార్చి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయి, ఎన్ని రోజులు క్లోజ్‌లో ఉంటాయనే జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్‌ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

ఏప్రిల్‌లో బ్యాంక్ హాలిడేస్
➤1 ఏప్రిల్: యాన్యువల్ బ్యాంక్ క్లోజింగ్
➤5 ఏప్రిల్: బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు (తెలంగాణ/ హైదరాబాద్​లోని బ్యాంక్​లకు సెలవు)
➤6 ఏప్రిల్: ఆదివారం (శ్రీరామనవమి)
➤10 ఏప్రిల్: మహావీర్ జయంతి (గుజరాత్​, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్​, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్​ బెంగాల్​, తెలంగాణలోని బ్యాంక్​లకు సెలవు)
➤12 ఏప్రిల్: రెండవ శనివారం
➤13 ఏప్రిల్: ఆదివారం
➤14 ఏప్రిల్: అంబేద్కర్ జయంతి 
➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్​ బెంగాల్​, అరుణాచల్​ ప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​లోని బ్యాంక్​లకు సెలవు)
➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్​, త్రిపుర, అసోం, రాజస్థాన్​, జమ్ము, హిమాచల్​ ప్రదేశ్​, శ్రీనగర్​లోని బ్యాంక్​లకు సెలవు)
➤20 ఏప్రిల్: ఆదివారం
➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్​లకు సెలవు)
➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం
➤27 ఏప్రిల్: ఆదివారం
➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్​ ప్రదేశ్​లోని బ్యాంక్​లకు సెలవు)
➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్​లకు సెలవు)

బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.

(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్‌ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్‌లో ఏవైనా అప్‌డేట్‌లు లేదా రివిజన్‌ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).

Advertisement
 
Advertisement
Advertisement