
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభం
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మహిళల కోసం ప్రత్యేకంగా.. ‘బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్‌ఆర్‌ఈ అండ్ ఎన్‌ఆర్‌వో సేవింగ్స్ ఖాతాను’ ప్రారంభించింది. ఆటో స్వీప్ సదుపాయంతో ఇది ఉంటుంది. తద్వారా ఖాతాలో పరిమితికి మించి ఉన్న బ్యాలెన్స్ డిపాజిట్‌గా మారిపోయి, అధిక వడ్డీ రాబడి లభిస్తుంది. అలాగే, ఈ ఖాతాదారులకు గృహ రుణాలు, ఆటో రుణాలపై రాయితీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది.
17 దేశాల్లో 60,000 టచ్ పాయింట్ల ద్వారా 16.5 కోట్ల అంతర్జాతీయ కస్టమర్లకు బీవోబీ సేవలు అందిస్తోంది. బీవోబీ ప్రీమియం ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌వో సేవింగ్స్ ఖాతా విషయంలోనూ మార్పులు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్న భారతీయ మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో బీవోబీ ఉమెన్ ఎన్‌ఆర్‌ఈ అండ్ ఎన్‌ఆర్‌వో ఖాతాను రూపొందించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ మీనా వహీద్ ప్రకటించారు.