టారిఫ్‌లపై ఊరట: పుంజుకున్న ఆసియా మార్కెట్లు | Asia Market Gain After Tariffs Extended 90 Days | Sakshi
Sakshi News home page

టారిఫ్‌లపై ఊరట: పుంజుకున్న ఆసియా మార్కెట్లు

Apr 10 2025 10:47 AM | Updated on Apr 10 2025 11:35 AM

Asia Market Gain After Tariffs Extended 90 Days

చైనా మినహా మిగతా దేశాలపై విధించిన అధిక సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రకటించిన తర్వాత.. ఆసియా మార్కెట్లు లాభాలబాట పట్టాయి. జపాన్ నిక్కీ 8.35% పెరిగింది. దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్  5.38 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ కోస్డాక్ 5.09 శాతం లాభపడింది.

చైనా.. అమెరికన్ వస్తువులపై 84 శాతం సుంకాలను ప్రకటించిన తరువాత.. అమెరికా సుంకాలను 104 శాతం నుంచి 125 శాతానికి పెంచడంతో.. పెట్టుబడిదారులు చైనా స్టాక్‌లపై ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. గురువారం(10న) శ్రీ మహావీర్‌ జయంతి సందర్భంగా భారతదేశంలో మార్కెట్లు సెలవు.

ప్రతీకార సుంకాల వార్‌
మొత్తం 75 దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్‌ అధికారికంగా ప్రకటించిన తరువాత.. అమెరికా- చైనాల మధ్య  ప్రతీకార సుంకాల వార్‌ కొనసాగుతోంది. ట్రంప్‌ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement