Apple iPhone 14 Available At Rs 26399 Up To Rs 43600 Off - Sakshi
Sakshi News home page

రూ. 26,399కే యాపిల్‌ ఐఫోన్‌14: ఎలా? 

Published Wed, Aug 2 2023 2:25 PM

Apple iPhone14 available at Rs 26399 up to Rs 43600 off - Sakshi

Apple iPhone 14  యాపిల్‌ ఐఫోన్‌ మరోసారి తగ్గింపు ధరలోఅందుబాటులోకివచ్చింది. ప్రస్తుతం  యాపిల్‌ లైనప్‌లో చౌక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్‌ 14. త్వరలోనే  ఐఫోన్‌ 15ను లాంచ్‌ చేయనున్న తరుణంలో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్  షురూ కానున్న నేపథ్యంలో ఈ  తగ్గింపు  అందుబాటులోకి రావడం గమనార్హం.  దాదాపు రూ. 43,600 వరకు తగ్గింపుతో  రూ. 26,399కే  ఐఫోన్ 14ను కొనుగోలు చేయవచ్చు.
 
ప్రస్తుతం అధికారిక స్టోర్‌లో రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద లిస్ట్‌ అయింది. దీనితో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4000 తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌, ఇతర ఆఫర్లతో కలిపి ఫ్లిప్‌కార్ట్‌  సేల్ కంటే ముందుగా యాపిల్‌ ఐఫోన్‌  14ని కేవలం 26,399 రూపాయలకే పొందవచ్చు.  కాగా  ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్  ఆగస్టు 4-9 వ తేదీవరకు కొనసాగనుంది. సేల్‌  ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం రేపటి నుండే ప్రారంభం.

 కాగా యాపిల్‌ ఐఫోన్‌14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రొ, యాపిల్‌ 14 ప్రో మాక్స్  వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 15 ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. (Today August 2nd gold price గుడ్‌ న్యూస్‌: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement