విచిత్ర వాహనాలు: ఆనంద్ మహీంద్రా ట్వీట్ | Anand Mahindra Tweet About Sudha Car Museum | Sakshi
Sakshi News home page

విచిత్ర వాహనాలు: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Oct 26 2024 9:14 PM | Updated on Oct 26 2024 9:23 PM

Anand Mahindra Tweet About Sudha Car Museum

ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు. ఇందులో షూ ఆకారంలో ఉన్న వాహనం రోడ్డుపై ప్రయాణిస్తుండటం చూడవచ్చు. ఈ వాహనం ఒక వ్యక్తి అభిరుచి వల్ల పుట్టినట్లు తెలుస్తోంది.

వీడియో షేర్ చేస్తూ.. ''ఎంత చమత్కారమైనా తమ అభిరుచులను పట్టుదలతో కొనసాగించే వ్యక్తులు లేకుంటే ఈ ప్రపంచ ఆసక్తిగా ఉండదు. ఈ వీడియోలో కనిపించే వెహికల్ చాలా చమత్కారంగా ఉంది. ఇలాంటి కార్ల పట్ల ఏదైనా అభిరుచికి మేము మద్దతిస్తాము అని అన్నారు. నేను ఈ సారి ఎప్పుడైనా హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను'' అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..

నిజానికి ఇలాంటి కార్లను హైదరాబాద్ వ్యక్తి సుధాకర్ రూపొందిస్తున్నారు. విచిత్ర రూపాలలో తయారు చేసిన కార్లను సుధా కార్ మ్యూజియం పేరుతో ఓ మ్యూజియం సృష్టించి అక్కడ ప్రదర్శించారు. ఇక్కడ వివిధ ఆకారాల్లో వాహనాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వివిధ ఆకారాల్లో వాహనాలను తయారు చేయడంతో ఈయన గిన్నిస్ రికార్డులో సైతం చోటు సంపాదించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement