136 కిమీ రేంజ్.. కొత్త నెక్సస్ EX+ లాంచ్! | Ampere Nexus EX Plus Launched At Rs 1 30 Lakh | Sakshi
Sakshi News home page

136 కిమీ రేంజ్.. కొత్త నెక్సస్ EX+ లాంచ్!

Oct 5 2026 6:22 PM | Updated on Oct 5 2026 6:29 PM

Ampere Nexus EX Plus Launched At Rs 1 30 Lakh

ఆంపియర్ భారతదేశంలో నెక్సస్ EX+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఆప్షనల్ ఇంటెల్లిప్యాక్ కనెక్టెడ్ టెక్నాలజీ సూట్‌తో కూడిన వెర్షన్ ధర రూ. 1.36 లక్షలు. రెండు వేరియంట్లు కార్బన్ నైట్, స్టీల్ గ్రే రంగులలో అందుబాటులో ఉన్నాయి.

ఆంపియర్ నెక్సస్ EX+ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 5కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది 202 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 4.5 సెకన్లలో 0 నుంచి 40 కిమీ/గం వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇది 136 కిమీ రేంజ్ అందించనున్నట్లు సమాచారం.

ఇందులో లైవ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, ఫైండ్ మై స్కూటర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, ట్రిప్ రిపోర్ట్‌లు, బ్యాటరీ హెల్త్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. ఈ స్కూటర్ భారతదేశలోని కంపెనీకి చెందిన అన్ని డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement