అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఆ వస్తువులు ఇక అమ్మరు.. | Amazon Flipkart And Others Delist Walkie Talkie Products After Centre Guidelines | Sakshi
Sakshi News home page

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఆ వస్తువులు ఇక అమ్మరు..

Jun 1 2025 8:43 PM | Updated on Jun 1 2025 8:53 PM

Amazon Flipkart And Others Delist Walkie Talkie Products After Centre Guidelines

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అన్నది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. దుస్తుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాల వరకూ అన్నింటినీ ఈ-కామర్స్‌ సంస్థల్లోనే కొనేస్తున్నారు. అయితే ఇలా అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు వీల్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మీషో, జియోమార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వాకీ-టాకీల విక్రయాలను నిలిపేశాయి.

రేడియో పరికరాల అక్రమ లిస్టింగ్, అమ్మకాల నివారణ, నియంత్రణ కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) మార్గదర్శకాలను జారీ చేసిన మీదట ఈ-కామర్స్ సంస్థలు తమ విక్రయ వస్తువుల జాబితా నుంచి వాకీ-టాకీలను తొలగించాయని ఎన్‌డీటీవీ కథనం పేర్కొంది. రేడియో కమ్యూనికేషన్ పరికరాలు ముఖ్యంగా భద్రతా ముప్పును కలిగించే వాకీ-టాకీలను ఆన్‌లైన్‌లో అనధికారికంగా విక్రయించడాన్ని అరికట్టడానికి ఈ మార్గదర్శకాలను జారీ చేశారు.

టెలికమ్యూనికేషన్స్ విభాగం, హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు సీసీపీఏ పీఐబీ ప్రకటనలో పేర్కొంది. చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు లేదా లైసెన్సింగ్ వివరాలు లేకుండానే  చాలా సంస్థలు  ఆన్‌లైన్‌లో వాకీటాకీలను విక్రయిస్తున్నట్లు గుర్తించామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా సంస్థలు వాకీటాకీల ఫ్రీక్వెన్సీ రేంజ్, వాటిని వినియోగానికి లైసెన్స్ అవసరమా అన్న వివరాలను పేర్కొనకుండా, ఆ పరికరాలను స్వేచ్ఛగా ఉపయోగించవచ్చని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని గుర్తించిన మీదట తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

దీంతో కొన్ని ఈ- కామర్స్‌ సంస్థలు తమ లిస్టింగ్‌ నుంచి వాకీటాకీలను తొలగించినప్పటికీ మరికొన్ని మాత్రం​ ఇప్పటికీ అలాగే కొనసాగిస్తుండటం గమనార్హం. అన్ని ప్రధాన ఆన్‌లైన్‌ విక్రయ సంస్థల్లో 16,970 వస్తువులకు సంబంధించి ఫ్రీక్వెన్సీ, అవసరమైన లైసెన్సింగ్  వివరాలు లేకపోవడంపై సీసీపీఏ గతంలోనే 13 నోటీసులు జారీ చేసింది. ఈ ప్లాట్ ఫామ్ లు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement