
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో హానికరమైన వెబ్‌సైట్లను గుర్తించి, బ్లాక్ చేసే ఫ్రాడ్ డిటెక్షన్ సరీ్వసును అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ ఎయిర్‌టెల్ వెల్లడించింది. ఇది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం, ఈమెయిల్ మొదలైన ఓవర్–ది–టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ యాప్స్, ప్లాట్‌ఫాంలన్నింటికీ పని చేస్తుంది. తమ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు అదనంగా ఎలాంటి చార్జీలు లేకుండా కంపెనీ దీన్ని ఆటో–ఎనేబుల్ చేస్తుంది.
ఈ సరీ్వస్ ప్రకారం ఎయిర్‌టెల్ అధునాతన సెక్యూరిటీ సిస్టం హానికరమైనదిగా గుర్తించిన వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి కస్టమర్ ప్రయతి్నస్తే, పేజీ లోడ్ కాదు. బ్లాక్ చేయడానికి గల కారణాన్ని వివరించే పేజీ వస్తుంది. ప్రస్తుతానికి ఈ సరీ్వసు హర్యానా సర్కిల్‌లో అందుబాటులో ఉందని, త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే ప్రణాళికలు ఉన్నాయని సంస్థ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ తెలిపారు. దీనితో స్కామ్‌ల బారిన పడతామనే భయం లేకుండా కస్టమర్లు నిశి్చంతగా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.