బోయింగ్ 777లో సౌకర్యాలు మెరుగుపరిచిన ఎయిర్ ఇండియా

AirIndia Upgraded Boeing 777 Facilities - Sakshi

టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానాల్లోని సౌకర్యాలను మెరుగుపరించింది. ఈ విమానాల ద్వారా అమెరికాలోని మూడు స్థానాలకు నేరుగా చేరుకునేలా నాన్‌స్టాప్‌ సేవలు అందిస్తుంది. ముంబై నుంచి న్యూయార్క్ జేఎఫ్‌కే విమానాశ్రయం, నెవార్క్ లిబర్టీ ఎయిర్‌పోర్ట్ (న్యూజెర్సీ), శాన్ ఫ్రాన్సిస్కోకు సర్వీసులు ఉన్నాయి. అయితే గతంలో ఆ విమానాల్లో కల్పిస్తున్న సేవలపై వినియోగదారులు అంతగా సంతృప్తికరంగా లేకపోవడంతో వాటిని మెరుగుపరిచారు. అందుకు సంబంధించిన వీడియోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top