
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా సంస్థ ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్‌ఎల్‌ఐ) తాజాగా హైదరాబాద్‌లో పూర్తిగా మహిళా సిబ్బందితో బ్రాంచీని ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో ఈ తరహా ఆల్–ఉమెన్ బ్రాంచీని ప్రారంభించగా, ఇది రెండోదని వివరించింది.
దీనితో హైదరాబాద్‌లో తమ శాఖల సంఖ్య 7కు, దేశవ్యాప్తంగా 433కి చేరిందని కంపెనీ ఎండీ కమలేష్ రావు తెలిపారు. మహిళా అడ్వైజర్లకు సహాయకరంగా ఉండేలా ఈ శాఖలో కిడ్స్ రూమ్‌లాంటి సదుపాయాలు కూడా ఉంటాయని వివరించారు.

ఆదిత్య బిర్లా గ్రూప్ (ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ ద్వారా), కెనడా ఆర్థిక సేవల దిగ్గజం సన్ లైఫ్ ఫైనాన్షియల్ మధ్య జాయింట్ వెంచర్‌గా 2000 ఆగస్టులో ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటైంది. 2001 జనవరిలో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ దేశంలోని టాప్ ప్రైవేట్ జీవిత బీమా కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది.