ఆధార్ అప్‌డేట్‌కు కొత్త డెడ్‌లైన్‌ | Aadhaar Update Date Extended new Deadline for free Aadhaar update | Sakshi
Sakshi News home page

ఆధార్ అప్‌డేట్‌కు కొత్త డెడ్‌లైన్‌

Jun 14 2025 7:58 PM | Updated on Jun 14 2025 8:20 PM

Aadhaar Update Date Extended new Deadline for free Aadhaar update

ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాల అప్‌డేట్‌కు గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరోసారి పొడిగించింది. ఆధార్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప​్‌డేట్ చేసుకునేందుకు గడువు జూన్ 14న ముగియాల్సి ఉండగా యూఐడీఏఐ ఈ సదుపాయాన్ని మరో ఏడాది పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించింది. ఈ మేరకు ‘ఎక్స్‌’(ట్విటర్‌) ద్వారా యూఐడీఏఐ వెల్లడించింది.

ఆధార్‌ను ఎవరు అప్‌డేట్ చేసుకోవాలంటే..
ఆధార్ అప్‌డేట్‌కు గడువు పొడిగింపుతో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు ఉపశమనం కలగనుంది. ఈ ఉచిత సేవ మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్ చేయించుకుని ఇప్పటి వరకు అప్‌డేట్‌ చేసుకోని వారు ఆధార్ అప్‌డేట్‌ చేయాలని యూఐడీఏఐ కోరింది. వివాహం, బదిలీ లేదా ఇతర కారణాల వల్ల పేరు, చిరునామా లేదా మరేదైనా సమాచారం మారితే అప్‌డేట్‌  చేసుకునేందుకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఈ ఆన్‌లైన్ సర్వీసుకు రూ.50 ఫీజు వసూలు చేసేవారు. డిజిటల్ మార్గాల ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్‌ను ప్రోత్సహించడానికి యూఐడీఏఐ ఈ ఛార్జీని తొలగించింది. అయితే ఫిజికల్ ఆధార్ అప్‌డేట్‌ సెంటర్లలో చేసే అప్‌డేట్‌కు మాత్రం ఇంకా రుసుం వసూలు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేసుకోండిలా..
🔹యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ( https://myaadhaar.uidai.gov.in ) సందర్శించండి.
🔹ఆధార్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వండి.
🔹సమాచారాన్ని సరిచూసుకుని 'ఐ వెరిఫై...'పై క్లిక్ చేయండి.
🔹ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ  (PoI) ఎంచుకుని 2MB కంటే తక్కువ పరిమాణంలో (JPEG/PNG/PDF) డాక్యుమెంట్‌ కాపీని అప్‌లోడ్ చేయండి.
🔹డాక్యుమెంట్ ఆఫ్ అడ్రస్ (PoA) సెలెక్ట్ చేసి డాక్యుమెంట్‌ కాపీని అప్‌లోడ్ చేయాలి.
🔹అగ్రీ అండ్‌ సబ్మిట్‌పై క్లిక్‌ చేయండి.
🔹రసీదును డౌన్ లోడ్ చేసుకోండి.

Advertisement
 
Advertisement
Advertisement