రూ.2 వేలనోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్‌బీఐ

97 Percent Of The Rs 2000 Denomination Banknotes Returned To Banks - Sakshi

రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. రద్దు చేసిన వాటిలో కేవలం రూ.8,202 కోట్లు విలువచేసే రూ.2వేలనోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. 

గతేడాది మే 19న ఆర్‌బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడక ముందు రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేలనోట్లు చెలామణిలో ఉండేవని తెలిపింది. గత నెల 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఇంకా రూ.8,202 కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదని చెప్పింది. 

ఇదీ చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ

ఆర్‌బీఐ గతేడాది మే 19న రూ.2వేలనోట్ల రద్దు ప్రకటించింనా, సెప్టెంబర్‌ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించింది. ఆ తర్వాత నుంచి 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అహ్మదాబాద్, బెంగుళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్‌బీఐ కార్యాలయాల్లో నోట్లను డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు వీలుంది.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 


 

Read also in:
Back to Top