Jobs in 5G and Telecom have increased 34% in last 12 months in India - Sakshi
Sakshi News home page

దేశంలో 5జీ సేవలు.. భారీగా ఉద్యోగాలు, కావాల్సిన నైపుణ్యాలు ఇవే!

Published Wed, Nov 23 2022 3:59 PM

5g Services: Jobs Increase In Telecom Sector Increase In India - Sakshi

5జీ టెక్నాలజీ..టెలికం రంగంలో సరికొత్త విప్లవం! స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో.. ఆధునిక 5జీ టెక్నాలజీతో.. గేమింగ్‌ నుంచి గృహ అవసరాల వరకు..అన్ని రకాల సేవలు అత్యంత వేగంగా  పొందే వీలుంది. ఇదే ఇప్పుడు ఆయా రంగాల విస్తరణకు, లక్షల సంఖ్యలో కొత్త కొలువులకు మార్గం వేస్తుందని అంచనా! ఆయా ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు కావలసిందల్లా.. ఈ సాంకేతికతను నడిపించే ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడమే! ముఖ్యంగా 4.0 స్కిల్స్‌గా పేర్కొంటున్న ఐఓటీ, రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్‌ వంటి నైపుణ్యాలతో ఉజ్వల కెరీర్‌ అవకాశాలు అందుకోవచ్చు. ఇటీవల దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఈ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్న కొత్త కొలువులు, కావల్సిన నైపుణ్యాల గురించి తెలుసుకుందాం.. 

5జీ టెక్నాలజీతో మొబైల్‌ ఆధారిత సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్స్‌ ద్వారా అత్యంత వేగంగా అనేక సేవలు ΄÷ందొచ్చు. అంతేకాదు.. ట్రాఫిక్‌ చిక్కులు దాటుకుంటూ ఇంటికెళ్లే సమయానికి హాయిగా ఏసీలో ఆహ్లాదం పొందాలంటే..ఇక చిటికెలో పని. కేవలం ఫోన్‌ ద్వారా నిర్దేశిత కమాండ్స్‌తో మనం ఇంటికెళ్లే సమయానికి ఏసీ ఆన్‌ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సేవలు సరికొత్తగా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఆయా సేవలు అందించేందుకు బ్యాక్‌ ఎండ్‌లో నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఇదే యువతకు కొత్త కొలువులకు మార్గంగా నిలవనుంది.

భారీ సంఖ్యలో కొలువులు
► 5జీ టెక్నాలజీ కారణంగా రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల మేర ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే టెలికం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ నివేదిక పేర్కొంది.
►ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్, రోబోటిక్‌ ్ర΄ాసెస్‌ ఆటోమేషన్‌ విభాగాల్లో ఈ కొలువులు లభించనున్నాయి.
►ఇప్పటికే 40 లక్షల మేర ఉద్యోగాలకు వేదికగా ఉన్న టెలికం రంగంలో.. 5జీ టెక్నాలజీ కారణంగా జాబ్స్‌ సంఖ్య మరింత విస్తృతంగా పెరగనుంది. ∙టెలికం సెక్టార్‌ మాత్రమే కాకుండా.. నూతన టెక్నాలజీలతో సేవలందిస్తున్న ఇతర రంగాల్లోని సంస్థలు కూడా 5జీ టెక్నాలజీస్‌కు సరితూగే నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కల్పించనున్నాయి. 
 ►  రిమోట్‌ సర్వీసెస్‌కు వినియోగదారుల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా తమ సేవలను అందించే ఉద్దేశంతో 5జీ టెక్నాలజీ నైపుణ్యాలకు కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి.

అన్ని రంగాల్లోనూ 5జీ
వ్యవసాయం నుంచి వైద్యం వరకూ..అన్ని రంగాల్లోనూ 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కార్యకలా΄ాలు నిర్వహించే అవకాశం ఉంది. హెల్త్‌కేర్‌ రంగంలో.. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా టెలి మెడిసిన్‌ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. 5జీ టెక్నాలజీతో రానున్న రోజుల్లో కీలకమైన శస్త్రచికిత్సలు చేసే అవకాశం కూడా అందుబాటులోకి రానుంది. అదే విధంగా 3–డీ ఎక్స్‌రేలు, ఇతర స్కానింగ్‌లు కూడా తీసే వీలుంటుంది. ∙వ్యవసాయ రంగంలో.. 5జీ ఫోన్‌లో ఉండే ఐఓటీ సాంకేతికత ఆధారంగా.. వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ.. వాటికి సరితూగే పంటలు వేయడం లేదా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సాగులో దిగుబడి పెంచేందుకు అవకాశం ఉంటుంది. ∙రిటైల్‌ రంగంలోనూ.. 5జీ ఫోన్‌లతో.. వర్చువల్, ఆగ్మెంటెడ్‌ రియాల్టీని ఆస్వాదిస్తూ ఏదైనా ఒక వస్తువు లేదా ఉత్పత్తిని కళ్లకు కట్టినట్లు చూసుకోవడానికి.. అదే విధంగా.. ఆయా ఉత్పత్తుల నాణ్యతను లోతుగా పరిశీలించడానికి వీలవుతుంది.

ఐఓటీ ఆధారమే
5జీ టెక్నాలజీని వైద్యం,రిటైల్,ఫార్మా.. ఇలా అన్ని రంగాల్లోనూ విస్తృతంగా వినియోగించడానికి కారణం.. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ మహిమే. ఐఓటీ టూల్స్‌గా పేర్కొనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతలను 5జీ కారణంగా సంస్థలతో΄ాటు వ్యక్తులూ వినియోగించుకునే అవకాశం ఉంది.

క్లౌడ్‌ సర్వీసెస్‌ వయా 5జీ
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటే.. ఇంటర్నెట్‌ లేదా ఆన్‌లైన్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌లను అందించడం! ఇప్పుడు ఈ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ స్మార్ట్‌ ఫోన్లలోనూ కనిపిస్తోంది. ఉదాహరణకు.. పలు హైఎండ్‌ ఫోన్లలో అందుబాటులో ఉంటున్న ఎంఎస్‌ ఆఫీస్‌ టూల్స్, పీడీఎఫ్‌ వ్యూయర్స్, పీడీఎఫ్‌ డ్రైవ్స్‌ను అప్పటికప్పుడు స్మార్ట్‌ ఫోన్‌లోనే ΄÷ందే అవకాశం లభిస్తోంది. ఫలితంగా యూజర్లు తాము డౌన్‌లోడ్‌ చేసుకున్న విభిన్న వెర్షన్ల డాక్యుమెంట్లను ఎలాంటి ప్రీ–లోడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ లేకుండానే వీక్షించే సదు΄ాయం కలుగుతోంది.

రోబో ఆధారిత సేవలు
΄ారిశ్రామిక రంగంలో ఇటీవల కాలంలో రోబోటిక్‌ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. రోబో ఆధారిత కార్యకలా΄ాలు, సేవలు విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నాయి. ఈ సేవలను వ్యక్తుల స్థాయిలోనే ΄÷ందేందుకు 5జీ ఫోన్లు ఉపకరిస్తాయి. ఉదాహరణకు.. 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండే నిర్దిష్టమైన సెన్సార్లు, డిస్ట్రిబ్యూటెడ్‌ నెట్‌వర్క్‌ సాంకేతికతల ఆధారంగా ఎక్కడో సుదూరాల్లో ఉన్న రోబోల సాయంతో సర్జరీలు చేసే అవకాశం లభించనుంది.

నిపుణుల కొరత
5జీ సేవలు అందించాలనుకుంటున్న సంస్థలు నిపుణులైన మానవ వనరుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. పలు కంపెనీలు రీ–స్కిల్లింగ్‌ పేరుతో 5జీ టెక్నాలజీస్‌పై తమ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి. టాటా సన్స్‌కు చెందిన పొనటోన్‌ ఫిన్‌వెస్ట్‌ లిమిటెడ్‌.. తేజస్‌ నెట్‌వర్క్‌తో ఒప్పందం చేసుకుని శిక్షణనిస్తోంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థ కూడా తమ ఇంజనీరింగ్, ఆర్‌ అండ్‌ డీ విభాగం ద్వారా 5జీ టెక్నాలజీస్‌పై ఉద్యోగులకు శిక్షణ అందిస్తోంది.

నైపుణ్యం పొందే మార్గాలివే
►  5జీ టెక్నాలజీకి సంబంధించి నైపుణ్యాలు పొందేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 5జీ టెక్నాలజీలో కీలకంగా నిలుస్తున్న రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఐఓటీ స్కిల్స్‌ను సొంతం చేసుకునేందుకు పలు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ శిక్షణ మార్గాలు ఉన్నాయి. 
► టెలికం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్, సిస్కో, ఒరాకిల్‌ ఇండియా, ఐబీఎం, డి΄ార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఆధ్వర్యంలో పలు ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. 
 ►  ఐఐటీ–రూర్కీ, ఢిల్లీ కూడా సర్టిఫికెట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ స్థాయిలో 5జీ టెక్నాలజీ అండ్‌ ఐఓటీ కోర్సులను అందిస్తున్నాయి.
 ►  కోర్స్‌ఎరా, ఉడెమీ తదితర సంస్థలు సైతం మూక్స్‌ విధానంలో 5జీ టెక్నాలజీస్, ఐఓటీ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి.
 

5జీ టెక్నాలజీస్‌.. ముఖ్యాంశాలు
 ►పలు రిక్రూటింగ్, స్టాఫింగ్‌ సంస్థల నివేదికల ప్రకారం–ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 5జీ కొలువుల్లో 20 నుంచి 25 శాతం మేరకు పెరుగుదల.
 ►  అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం–వచ్చే పదేళ్లలో 20 మిలియన్లకు పైగా ఉద్యోగాలు.
 ►  టెలికం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ అంచనా ప్రకారం–2025 నాటికి 2.2 మిలియన్ల జాబ్స్‌.
 ►  టెలికం రంగంలోనే ఈ ఏడాది దాదాపు లక్ష ఉద్యోగాలు.
 ►  2021లో సిస్కో ఇండియా నియామకాల్లో 30 శాతంపైగా 5జీ టెక్నాలజీ విభాగంలోనే ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement