వోల్వో కొత్త కారు లాంచ్: 625 కిమీ రేంజ్! | 2027 Volvo EX90 Launched At Rs 1 26 Crore | Sakshi
Sakshi News home page

వోల్వో కొత్త కారు లాంచ్: 625 కిమీ రేంజ్!

Oct 12 2026 2:57 PM | Updated on Oct 12 2026 3:13 PM

2027 Volvo EX90 Launched At Rs 1 26 Crore

వోల్వో కంపెనీ.. దేశీయ మార్కెట్లో తన ఆల్ ఎలక్ట్రిక్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన ఈఎక్స్90ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.26 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది కొత్త 800వీ ఎస్పీఏ-2 ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్చర్‌పై నిర్మితమైన 6 సీటర్.

వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ కారు.. 450 Bhp పవర్, 60 Nm టార్క్ ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ సెటప్‌తో పనిచేస్తుంది. ఇందులోని 106 kWh బ్యాటరీ.. ఒక ఫుల్ ఛార్జితో 625 కిమీ రేంజ్ అందిస్తుంది. బైడైరెక్షనల్ ఛార్జింగ్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఈ కొత్త కారులో నిక్షిప్తమై ఉన్నాయి.

డెనిమ్ బ్లూ, సాండ్ డ్యూన్, మల్బరీ రెడ్, క్రిస్టల్ వైట్, ఓనిక్స్ బ్లాక్, వేపర్ గ్రే అనే ఆరు రంగులలో లభించే వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ కారు డెలివరీలు.. 2027 జనవరి నుంచి ప్రారంభమవుతాయి. అయితే డిసెంబర్ 31, 2026 వరకు చెల్లుబాటు అయ్యే పరిచయ ధరలో 11 kW వాల్ బాక్స్ ఛార్జర్, 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ ఉంటాయి. అంతే కాకుండా.. 3 సంవత్సరాల తర్వాత వోల్వో డీలర్‌షిప్‌లు 65 శాతం బైబ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నాయి.

వోల్వో ఈఎక్స్90 లగ్జరీ ఎలక్ట్రిక్ కారు.. మెర్సిడెస్-బెంజ్ ఈక్యూఎస్, కియా ఈవీ9, బీఎండబ్ల్యూ ఐఎక్స్ వంటి వాటికి అమ్మకాల్లో గట్టి పోటీ ఇస్తుంది.

ఇదీ చదవండి: పండుగ ఆఫర్స్.. బైక్ కొనేందుకు మంచి ఛాన్స్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement