యమహా మోటార్.. తమ స్కూటర్, మోటార్‌సైకిల్ శ్రేణిపై పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భీమా ప్రయోజనాలు, తక్కువ డౌన్ పేమెంట్ పథకాలు కూడా ఉన్నాయి. ఫాసినో 125, రేజెడ్ఆర్ 125, ఎఫ్‌జెడ్ సిరీస్, ఎక్స్‌ఎస్ఆర్155, ఆర్15, ఎంటీ-15 సహా ఎంపిక చేసిన మోడళ్ల కొనుగోలుపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
కంపెనీ అందించే ఆఫర్ కింద.. ఫాసినో 125, రేజెడ్ఆర్ 125 మోడళ్లకు రూ. 3,399 నుంచి ప్రారంభమయ్యే భీమా ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు. కాగా ఎఫ్‌జెడ్ సిరీస్‌కు రూ. 5,999 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఎక్స్‌ఎస్ఆర్155 కొనుగోలుపై రూ. 5,555 భీమా ప్రయోజనాలు లభిస్తాయి. అయితే.. ఈ పథకం కింద ఆర్15, ఎంటీ-15 మోడళ్లకు ప్రత్యేక భీమా ప్రయోజనం లభించదు.
ఫాసినో 125, రేజెడ్ఆర్ 125 కోసం తక్కువ డౌన్ పేమెంట్ రూ. 2,499 నుంచి ప్రారంభమవుతుంది. FZ సిరీస్ కోసం ఇది రూ. 3,900 నుంచి ప్రారంభమవుతుంది, అయితే ఎక్స్ఎస్ఆర్155, ఆర్15, ఎంటీ-15 బైకులు రూ. 4,999 డౌన్ పేమెంట్‌తో అందుబాటులో ఉన్నాయి.
ఎఫ్‌జెడ్ సిరీస్ ఆఫర్ ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ హైబ్రిడ్, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4 డీఎల్ఎక్స్, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4, ఎఫ్‌జెడ్ రేవ్, ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ మోడళ్లను కూడా కవర్ చేస్తుంది. అయితే ఈ పరిమిత కాల పండుగ ఆఫర్లు తమిళనాడు, కేరళ మినహా భారతదేశంలోని అధీకృత యమహా డీలర్‌షిప్‌లన్నింటిలో అందుబాటులో ఉన్నాయి. కచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.
ఇదీ చదవండి: సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 250 కిమీ రేంజ్!


