రూ .4.53 లక్షల ధర.. కొత్త కారు విడుదల | 2026 Renault Kwid Launched India Price Features | Sakshi
Sakshi News home page

రూ .4.53 లక్షల ధర.. కొత్త కారు విడుదల

Jul 4 2026 12:51 PM | Updated on Jul 4 2026 1:09 PM

2026 Renault Kwid Launched India Price Features

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో 2026 మోడల్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ప్రారంభ (ఎక్స్‌-షోరూమ్) ధరను రూ.4.53 లక్షలుగా నిర్ణయించింది. ఈ తాజా వెర్షన్‌లో డిజైన్, క్యాబిన్‌లో స్వల్ప మార్పులతో పాటు వేరియంట్ లైనప్‌ను కూడా కంపెనీ సరళీకృతం చేసింది. కారు ఎవల్యూషన్, క్లైంబర్ అనే రెండు ట్రిమ్‌లలో, 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

వేరియంట్లు – ధరలు

  • ఎవల్యూషన్ - 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.4.53 లక్షలు, AMT వేరియంట్ ధర రూ.4.90 లక్షలు

  • క్లైంబర్  - 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.5.15 లక్షలు, AMT వేరియంట్ ధర రూ.5.61 లక్షలు

లైనప్‌లో మార్పులు

2026 అప్‌డేట్‌తో ఇప్పటివరకు ఉన్న స్టాండర్డ్, టెక్నో వేరియంట్లను కంపెనీ నిలిపివేసింది. దీంతో క్విడ్ శ్రేణి ఇప్పుడు రెండు ప్రధాన ట్రిమ్‌లకే పరిమితమైంది. మాన్యువల్ వేరియంట్లకు కంపెనీ అధీకృత డీలర్‌ల ద్వారా రెట్రోఫిట్ సీఎన్‌జీ కిట్ కూడా అందిస్తోంది. దీని అదనపు ధర రూ.70,450గా నిర్ణయించారు.

కొత్త 2026 క్విడ్‌లో 3డీ రెనాల్ట్ లోగో, 14 అంగుళాల స్టీల్ వీల్స్‌కు కొత్త డ్యూయల్-టోన్ వీల్ కవర్లు, టెయిల్‌గేట్‌పై సిల్వర్ ఫినిష్‌తో 'KWID' లెటరింగ్ వంటి మార్పులు చేశారు. అయితే LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, ముందు-వెనుక బంపర్ల డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

క్యాబిన్‌లో కొత్త స్టీరింగ్ వీల్

ఇంటీరియర్‌లో ప్రధాన మార్పు రెనాల్ట్ కైగర్ నుంచి తీసుకొచ్చిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్‌ను కూడా సమీకరించారు. అలాగే 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఏసీ, పవర్ విండోలు వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.

భద్రతా పరంగా ఎవల్యూషన్ ట్రిమ్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, క్లైంబర్ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందించారు. అదనంగా రియర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), AMT వేరియంట్‌కు హిల్ స్టార్ట్ అసిస్ట్, EBDతో కూడిన ABS, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త క్విడ్‌లో ఇప్పటికే ఉన్న 1.0 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 69 బీహెచ్‌పీ పవర్‌, 92.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు లభిస్తాయి.

భారత ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రెనాల్ట్ క్విడ్‌కు ప్రధాన ప్రత్యర్థులుగా మారుతి సుజుకి ఆల్టో K10, మారుతి సెలెరియో వంటి మోడళ్లు ఉన్నాయి. తక్కువ ధర, ఆధునిక ఫీచర్లు, సీఎన్‌జీ ఎంపిక వంటి అంశాలతో ఈ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెనాల్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు రూ.11 లక్షలకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement