ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయ దుందుభి మోగించాలని, అందుకు తగిన ప్రణాళికలు ఇప్పటినుంచే రూపొందించుకోవాలని మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ భవన్‌లో శనివారం ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరిగే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై సమీక్షించిన కేటీఆర్‌... స్థానాన్ని బీఆర్‌ఎస్‌ కై వసం చేసుకునే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటర్లుగా చేర్పించాలని, ‘సర్‌’లో ఎవరూ ఓట్లు కోల్పోకుండా పార్టీ శ్రేణులు పర్యవేక్షించాలని తెలిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా నేతలు సమన్వయంతో పనిచేస్తూ క్రియాశీలక నేతలకు బాధ్యతలను అప్పగించాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉందనే విషయం ఈ విజయంతో నిరూపితమవుతుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, బానోత్‌ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్‌ చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, నాయకులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా నేతలతో

మాజీ మంత్రి కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement