సూపర్‌బజార్(కొత్తగూడెం): భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐల మ్మ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివా రం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించగా ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించాక కలెక్టర్ మాట్లాడారు. దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడడమే కాక తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తి గా నిలుస్తారని తెలిపారు. జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి పి.విజయలక్ష్మి, నాయకులు నేరెళ్ల రమేష్, అజిత్‌కుమార్, కె.వంశీ, పి. కొండల్, పి.శంకర్, ఎన్.మల్లయ్య, ఎన్.మోహన్‌రావు, కొదుమూరి సత్యనారాయణ, జి.సత్యనారాయణ పాల్గొన్నారు.
పుష్కర పనుల్లో వేగం
గోదావరి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సూచించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా భద్రాచలంలో చేపట్టిన పనులను కలెక్టర్ అంకిత్ వివరించారు. పుష్కర ఘాట్లు, ఆలయాల అభివృద్ధి పనులతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్నామని తెలిపారు.
జయంతి వేడుకల్లో కలెక్టర్ అంకిత్


