చర్ల: చర్ల ప్రభుత్వ వైద్యశాలలో 24గంటల వ్యవధిలో ఎనిమిది ప్రసవాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది గర్భిణులను ప్రసవానికి తీసుకొచ్చారు. ఈమేరకు వైద్యులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు నలుగురికి సాధారణ ప్రసవాలు చేయగా, మరో నలుగురికి సిజేరియన్ నిర్వహించారు. గర్భిణుల్లో బత్తినపల్లికి చెందిన మిడియం సమ్మక్క, సీ కత్తిగూడెంకు చెందిన పాయల నవిత, కారం హారి, దానవాయిపేటకు చెందిన మడకం శిరీష, ఆనందకాలనీకి చెందిన మడకం రాధ, చర్లకు చెందిన నగెండ్ల హర్షిత, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మద్దేడుకు చెందిన గ్రేసీ చెటిల్, ధర్మారానికి చెందిన బొల్లె రమ్య ఉన్నారు. సూపరింటెండెంట్ సాయివర్దన్ పర్యవేక్షణలో వైద్యులు శ్రావణి, కృష్ణప్రసాద్, ఉద్యోగులు స్నేహ, అబ్రార్, శైలజ, దయామణి ప్రసవాలు చేయగా తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కాగా, సీహెచ్‌సీలో పీడియాట్రిషన్ ఒక్కరే విధుల్లో ఉండడంతో సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నందున సరిపడా వైద్యులను నియమించాలనే సూచనలు వస్తున్నాయి.


