చుంచుపల్లి: అటవీ ఉద్యోగుల అప్రమత్తంగా ఉంటేనే అటవీసంపద, వన్యప్రాణులు, సహజ వనరుల సంరక్షణ సాధ్యమవుతుందని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. కొత్తగూడెంలో శనివారం ఆయన కొత్తగూడెం, పాల్వంచ డివిజన్ అధికారులతో సమావేశమయ్యారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటలూ అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, సమాచారం అందగానే స్పందించాలని సూచించారు. అక్రమ కలప రవాణా, అనుమానాస్పద కదలికలపై టాస్క్‌ఫోర్స్, రేంజ్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వన్యప్రాణుల ఆవాసాల రక్షణ, అక్రమ వేట, విద్యుత్ ఉచ్చుల నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పాల్వంచ ఎఫ్‌డీఓ కృష్ణప్రసాద్, రేంజ్ అధికారులు శ్రీనివాస్, సురేష్, తేజస్విని, శ్రీనివాసరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగికి కుటుంబానికి ఆర్థికసాయం
బూర్గంపాడు మండలంలో విధులు నిర్వర్తిస్తూ వేట గాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు తాకి మృతి చెందిన చెరువు సింగారం బీట్ అధికారి బి.నవీన్ కుటుంబానికి భారత అటవీ సేవల సంక్షేమ నిధి అండగా నిలిచింది. ఈమేరకు రూ.2లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా, తొలివిడత రూ.లక్ష చెక్కును నవీన్ తండ్రికి డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ శనివారం అందజేశారు.


