చుంచుపల్లి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపుల్లో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా, నిబంధనల మేరకు వ్యవహరించాలని గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర విజిలెన్స్ అధికారి పి.బలరామ్ ఆదేశించారు. కొత్తగూడెంలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో శనివారం ఆయన సహాయ ఇంజనీర్లతో ఇళ్ల నిర్మాణ ప్రగతి, పనుల నాణ్యతపై సమీక్షించారు. లబ్ధిదారులు ఎవరిచేతిలో మోసపోకుండా అవగాహన కల్పించాల ని సూచించారు. అనంతరం ఉద్యోగులతో అవినీతి రహిత ప్రతిజ్ఞ చేయించారు. గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సవేరాం, అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలంలో విచారణ..
భద్రాచలంఅర్బన్: ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదులపై విజి లెన్స్ అధికారి పి.బలరామ్ విచారణ చేపట్టారు. లబ్ధిదారుల నుంచి రూ.5వేల చొప్పున కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారంటూ ఫిర్యాదు అందడంతో ఆయన శనివారం భద్రాచలం లో 43 మంది లబ్ధిదారులతో మాట్లాడారు. అయితే, తమనెవరూ డబ్బులు అడగలేదని లబ్ధిదారులు చెప్పినట్లు సమాచారం. ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్‌కు 1800599 5991కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.


