కమనీయం.. కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. కల్యాణం

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం స్వామివారి నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామ సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

గ్రామాభివృద్ధికి

సమగ్ర ప్రణాళికలు

ఇల్లెందురూరల్‌: వికసిత్‌ గ్రామపంచాయతీ ప్లాన్‌ ద్వారా గ్రామ సమగ్రాభివృద్ధి కోసం సమగ్రమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి అనూష సూచించారు. మండలంలోని సుదిమళ్ల రైతువేదికలో ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి మండలాల సర్పంచ్‌లు, కార్యదర్శులకు శనివారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. వీబీజీ రాంజీ ద్వారా కూలీలకు 125 రోజుల పనిదినాల కల్ప న, కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నీటి భద్రత, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి తదితర 375 పనులను నిర్ధేశించారని చెప్పారు. ఈమేరకు గ్రామ అవసరాలు, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా ప్రణాళికల రూపకల్పనకు సర్పంచ్‌లు, కార్యదర్శులు వచ్చేనెల 2న గ్రామసభలు నిర్వహించాని సూచించారు. అనంతరం పూబెల్లి గ్రామంలో ప్రణాళిక రూపకల్పనపై అవగాహన కల్పించారు.

మెడికల్‌ బోర్డ్‌లో

15 మంది ఇన్‌వ్యాలిడేషన్‌

రుద్రంపూర్‌: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధా న ఆస్పత్రిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కార్పొరేట్‌ మెడికల్‌ బోర్డ్‌ శనివారం ముగిసింది. వివిధ ఏరియాల నుంచి 120 మంది కార్మికులకు సమాచారం ఇవ్వగా 69 మందే హాజరయ్యారు. వీరిలో 15 మందిని మాత్రమే ఇన్‌వ్యాలిడేషన్‌ చేయగా, 38 మంది పిట్‌ఫర్‌ సేమ్‌జాబ్‌, ఐదుగురిని హయ్యర్‌ రిఫరల్‌కు, 11 మంది పిట్‌ ఫర్‌ సర్పేస్‌కు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 12.50శాతమే ఇన్‌వ్యాలిడేషన్‌ కాగా, వీరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement