ప్రకృతి ఒడిలో విహారం.. | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో విహారం..

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

అవగాహన కల్పిస్తున్నాం..

పాల్వంచ రూరల్‌: ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నా యి. ఆహ్లాదాన్ని పంచే ఎత్తయిన కొండలు, పచ్చని అడవులు, పారే సెలయేరులు, జలపాతాలు, రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన కిన్నెరసాని జలాశయం పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈక్రమాన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటకం విలువలను తెలియజేయడానికి ప్రతీ ఏడాది సెప్టెంబర్‌ 27న నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది పర్యాటకాన్ని ఆర్టిఫీయల్‌ ఇంటిలిజెన్స్‌ ఇతివృత్తంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ దృష్టి సారించింది.

సౌకర్యాలు నిల్‌..

ఉమ్మడి జిల్లాలో కొండాకోనలతో చూడచక్కని ప్రకృతి అందాల పరిసరాలు, అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రకమైన కట్టడాలు ఉన్నా, బహుముఖ ప్రయోజనాలు కలిగిన పర్యాటక ప్రాంతాల్లో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. ఉమ్మడి జిల్లాను పర్యాటక హాబ్‌గా తీర్చిదిద్దుతామని నేతలు హామీ ఇచ్చినా ఆచరణలో అమలుకాకపోవడంతో పర్యాటక శాఖ ఆదాయానికి గండి పడుతోంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏకో టూరిజం ద్వారా రూ.కోట్ల వ్యయం ఖర్చు చేసి అద్దాల మేడ, కాటేజీలు, బోటు షికారు, సఫారీ వాహనాలు ఏర్పాటు చేశారు. కిన్నెరసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మందేరకలపాడు వద్ద చప్పట్ల బావి జలపాతం, కేశవాపురం గ్రామ సమీపంలో గుట్ట నుంచి ఏడాది పొడవునా జాలు వారే జలధారకు రోడ్డు ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. ఈ పర్యాటక ప్రాంతాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఊతమిస్తే పర్యాటక రంగం పరుగులు పెడుతుంది.

ఉమ్మడి జిల్లాలో టూరిస్ట్‌ స్థలాలు..

● గోదావరి నది తీరంలో దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఒక్కటైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయంలో రామాయణం కాలంనాటి ఘట్టాల బాపుబొమ్మలు, వాటి ఆనవాళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

● భద్రాచలానికి 36 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉన్న పర్ణశాల ప్రకృతి రమణీయ దృశ్యాలతో విరజిల్లుతోంది.

● అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భారతదేశ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించేలా స్తంభాలు, గోడలపై శిల్పాలు దర్శనమిస్తున్నాయి.

● జమలాపురంలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యపూజలు, భక్తుల రద్దీతో కళకళలాడుతుంటుంది. కూసుమంచిలో కాకతీయులు నిర్మాణం చేసిన శివాలయం, విశ్రాంతి భవనం ఉంది.

● నేలకొండపల్లిలో వంద ఎకరాల విస్తీర్ణంలో మట్టితో నిర్మాణం చేసిన చారిత్రక కట్టడాలు, మజ్జుగూడెంలో ఉన్న బౌద్ధులు నాడు నిర్మించిన స్తూపాలు, గృహాలు ఉన్నాయి. పాలేరు రిజర్వాయర్‌లో బోటింగ్‌, కెఫటేరియన్‌, చిల్డ్రన్‌ పార్కు, ఖమ్మం పట్టణంలో చారిత్రక కట్టడం ఖమ్మం ఖిల్లాతో పాటు లకారం చెరువును ఆకర్షనీయంగా తీర్చిదిద్దడంతో పర్యాటలకు వినోదాన్ని అందిస్తుంది. రూ.8 కోట్ల వ్యయంతో సెన్సార్‌ బ్రిడ్జి నిర్మాణం చేశారు.

● వైరా, పాలేరు రిజర్వాయర్‌లలో ఏర్పాటు చేసిన బోటింగ్‌ సౌకర్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

కాగా, గత మూడేళ్ల కాలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,43,768 మంది, ఖమ్మం జిల్లాకు 1,10,868 మంది తరలివచ్చి ప్రకృతి అందాలను తిలకించినట్లుగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ సంస్థ ధ్రువీకరించింది.

జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి జాగృతం చేస్తాం. లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ రామవరంలో ట్రెక్కింగ్‌ నిర్వహిస్తాం. ప్రతీ సంవత్సరం జిల్లాలోని ప్రకృతి అందాలు వీక్షించేందుకు గతేడాది విదేశీ టూరిస్టులు 30 నుంచి 40 మంది వరకు వచ్చివెళ్లారు.

– అనూష, జిల్లా పర్యాటకశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement