మోదీ పాలనను నిరసిస్తూ ‘జైల్‌ భరో’ | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలనను నిరసిస్తూ ‘జైల్‌ భరో’

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: దేశంలో మోదీ పాలనను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపా రు. ఈమేరకు అక్టోబర్‌, నవంబర్‌లో ప్రజలకు అవగాహన కల్పించడమే కాక డిసెంబర్‌ 2, 3, 4 తేదీల్లో జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఖమ్మం గిరిప్రసాద్‌ భవన్‌లో శనివారం ఏనుగు గాంధీ అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అనుబంధంగా మా ర్చడంతో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎన్నికల సంఘం సహా వివిధ సంస్థలు స్వతంత్రను కోల్పోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీల అమలులో విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్‌ నాయకులు సిఫారసు చేసిన వారికి కాకుండా అర్హులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే, వృథాగా పోతున్న వర్షపు నీటిని చెరువులకు మళ్లించాలని, సాగర్‌ ఎడమ కాలువ వచ్చే జలాలను చెరువులు, కుంటలు నింపాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, నాయకులు మహ్మద్‌ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందే..

ఖమ్మం మామిళ్లగూడెం: ప్రజాస్వామ్య వ్యవస్థకు కళంకం తెచ్చేలా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఖమ్మంలో రాస్తారోకో నిర్వహించగా ఆయన మాట్లాడారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏఐకేఎంస్‌ జాతీయ మహాసభలకు ఏర్పాట్లు

ఖమ్మంమయూరిసెంటర్‌: అఖిల భారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) జాతీయ మహాసభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఈనెల 28నుంచి 30వ తేదీ వరకు మహాసభలు జరగనుండగా, శనివారం నగరంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలను తయారీని పరిశీలించి ఆయన మాట్లాడారు. సభ ఏర్పాట్లలో పీడీఎస్‌యూ, పీవైఎల్‌, పీఓడబ్ల్యూ, ఐఎఫ్‌ టీయూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రజాసంఘాల బాధ్యులు నిమగ్నమయ్యారని తెలిపారు. ఈమేరకు 28న జరిగే బహిరంగ సభలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ, అనుబంధ సంఘాల నాయకులు బండారు ఐలయ్య, గాదె ఝాన్సీ, టి.శ్రీనివాస్‌, అందె మంగ, ఉదయ్‌, పవన్‌, కోల లక్ష్మీనారాయణ, బి కిషన్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచిత న్యాయసాయం

ఖమ్మంలీగల్‌: అవసరమైన వారికి ఉచిత న్యాయం అందిస్తామని ఖమ్మం జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలోని అంధుల, బధిరుల పాఠశాలలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల చట్టం, న్యాయ సేవాధికార సంస్థల చట్టంలోని ముఖ్యాంశాలు, దివ్యాంగులకు అందుబాటులో ఉండే సదుపాయాలు, వివక్ష లేని విద్య, ఉపాధి అవకాశాలను వివరించారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

బచ్చోడుఏఈఓపై సస్పెన్షన్‌ వేటు

● యూరియా పేరిట నగదు వసూళ్లు

తిరుమలాయపాలెం: యూరియా పేరిట రైతులను నమ్మించి డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడిన తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు ఏఈఓ కల్యాణ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. యూరియా కొరతను ఆసరాగా చేసుకున్న ఆయన మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులకు యూరియా ఇప్పిస్తానంటూ నగదు వసూలు చేశాడు. ఆపై వారికి యూరియా ఇప్పించకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో రైతులు ఏఓ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కూసుమంచి ఏడీఏ రాజేష్‌కుమార్‌ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక మేరకు కల్యాణ్‌ను సస్పెండ్‌ చేస్తూ శనివారం ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కళ్యాణ్‌ మహబూబాబాద్‌ జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఓసారి సస్పెండ్‌ అయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement