బారులు దీరిన గణనాథులు ! | - | Sakshi
Sakshi News home page

బారులు దీరిన గణనాథులు !

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

● ఇప్పటికే గోదావరిలో 2వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం ● సరిపడా ఏర్పాట్లులేక భక్తుల ఎదురుచూపులు

● ఇప్పటికే గోదావరిలో 2వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం ● సరిపడా ఏర్పాట్లులేక భక్తుల ఎదురుచూపులు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పట్టణంతో పాటు గోదావరి తీరాన భారీ గణనాథుల విగ్రహాలే కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెరువుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. దీంతో పలు ప్రాంతాల భక్తులు వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం భద్రాచలానికి తీసుకొస్తున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకురావడంతో గత వారం రోజులుగా రాత్రింబవళ్లు నిమజ్జనం కొనసాగుతోంది. ఇప్పటివరకు 2వేల విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేయగా, ఆది, సోమవారం వరకు మరో వేయి విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సరైన ఏర్పాట్లు లేక...

గోదావరిలో నిమజ్జనానికి వందలాదిగా విగ్రహాలు తీసుకొస్తున్నారని తెలిసినా అధికారులు సరైన ఏర్పాట్లుచేయలేదనే విమర్శలు వస్తున్నాయి. కేవలం ఒకే లాంచీ ఏర్పాటుచేయడంతో కొందరి విగ్రహాలను దించి గోదావరి ఒడ్డున పెట్టారు. మరికొందరు భక్తులు వాహనాల్లోనే విగ్రహాలతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఆలస్యం జరుగుతుండడంతో కొందరు బ్రిడ్జిపై నుంచి గోదావరిలో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. కాగా, కరకట్ట, గోదావరి ఘాట్‌, జాతీయ రహదారి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా డీఎస్పీ అరుణ్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. ఇకనైనా లాంచీల సంఖ్యతో పాటు గజ ఈతగాళ్లు మరింత మందిని ఏర్పాటుచేస్తేనే నిమజ్జనం త్వరగా పూర్తయ్యే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement