నర్స్‌ కుటుంబానికి డబుల్‌ బెడ్రూంఇల్లు | - | Sakshi
Sakshi News home page

నర్స్‌ కుటుంబానికి డబుల్‌ బెడ్రూంఇల్లు

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

ములకలపల్లి: హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుండగా, హత్యకు గురైన ములకలపల్లి మండలానికి చెందిన ఆదివాసీ యువతి కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. గత నెల 28న ఆమె ఉంటున్న గది లో యువతి హత్యకు గురైన విషయం విదిత మే. ఈమేరకు బాధిత కుటంబానికి ప్రభుత్వం తరఫున డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పట్లోనే ప్రకటించారు. ఈమేరకు ఎమ్మె ల్యే జారె ఆదినారాయణ శనివారం ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎంపీడీఓ సత్యనారాయణ, సర్పంచ్‌ మడకం రవి, నాయకులు బత్తుల అంజి, జహీరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

రికార్డులు పక్కాగా

నిర్వహించాలి

డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌

ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): పీహెచ్‌సీ, హెల్త్‌ సబ్‌ సెంటరల్లో వైద్య పరీక్షలు, ప్రజలకు అందిన మందులు, స్టాక్‌ ఇతర వివరాలను రికార్డుల్లో క్రమం తప్పకుండా నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్‌ ఆదేశించా రు. ఎర్రగుంట పీహెచ్‌సీ పరిధి అన్నపురెడ్డిపల్లి సబ్‌హెల్త్‌ సెంటర్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రికార్డులు, మందుల లభ్యతను పరిశీలించడమే కాక గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని రెండు ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లను డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు.

శ్రీవారికి

నిత్యకల్యాణం, అభిషేకం

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించగా పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓజగన్మోహన్‌రా వు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

పశువుల వాహనం

పట్టివేత

భద్రాచలంఅర్బన్‌: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని భద్రాచలం టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. చర్ల నుంచి బూర్గంపాడు వైపు ఆరు పశువులతో వెళ్తున్న వాహనాన్ని బ్రిడ్జి పాయింట్‌ వద్ద పోలీసులు శనివారం ఆపి తనిఖీ చేశారు. ఈమేరకు అనుమతి లేదని తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు టౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement