సూపర్‌బజార్(కొత్తగూడెం): గణేష్ నిమజ్జన ఊరేగింపులో మారణాయుధం తల్వార్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించి, భయభ్రాంతులకు గురిచేసిన నలుగురు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ ఆదినారాయణ కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 11.30 గంటలకు గరీబ్‌పేట గ్రామంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా అదే గ్రామానికి చెందిన చిత్తరి లింగాప్రసాద్ తల్వార్ పట్టుకుని జన సమూహంలో తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించాడు. అతనితోపాటు పల్లె సతీష్, గోగుల నవీన్, నందతండాకు చెందిన భూక్య గణేష్ కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకోగా గమనించిన నలుగురు పరారయ్యారు. విచారణ చేపట్టి నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శాంతిభద్రతలకు విఘా తం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు.
నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు


