తాలిపేరుకు భారీగా వరద | - | Sakshi
Sakshi News home page

తాలిపేరుకు భారీగా వరద

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

●15 గేట్లు ఎత్తి 65,157 క్యూసెక్కుల వరదనీరు విడుదల

చర్ల: ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌కు 25 క్రస్టు గేట్లు ఉండగా, 15 గేట్లను ఎత్తి 65,157 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వచ్చినప్పటికీ శుక్రవారం ఉదయం వరద ఉధృతి పెరిగింది. దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో తాలిపేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, 73.08 మీటర్ల వద్ద క్రమబద్ధీకరిస్తున్నారు. కుడి కాలువ ద్వారా 5 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని పంటలకు విడుదల చేస్తున్నారు. కాగా శుక్రవారం ప్రాజెక్ట్‌ వద్ద 53 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement