జూలూరుపాడు(సుజాతనగర్): ఈ నెల 30వ తేదీలోగా ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు సూచించారు. సుజాతనగర్ మండలంలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాస్ బుక్, ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్‌తో ఏఈఓలను, మీ సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. ఏడీఏ సుధాకర్, ఏఓ నర్మద, ఏఈఓలు నరసింహ, నవ్య, స్వప్న, రైతులు పాల్గొన్నారు.
విద్యార్థినికి రూ. లక్ష నగదు బహుమతి
జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదుకున్న కందుకూరి పూజితకు శ్రీరామ్ గ్రూప్స్ సంస్థ రూ.లక్ష నగదు బహుమతి అందజేసింది. పదో తరగతిలో పూజిత 565 మార్కులు సాధించి నియోజకవర్గ స్థాయిలో టాపర్‌గా నిలిచింది. జిల్లా స్థాయిలో నాలుగో స్థానం సాధించింది. హైదరాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా విద్యార్థినికి నగదు అందించారు. ప్రస్తుతం విద్యార్థిని ఖమ్మంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ సందర్భంగా విద్యార్థినిని హెచ్‌ఎం ఎస్కే మీరా సాహెబ్, ఉపాధ్యాయులు అభినందించారు.
పోషకాహారంపై అవగాహన
అశ్వారావుపేటరూరల్: ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా సంక్షేమ అధికారిణి జేఎంఎస్ లెని నా అన్నారు. శుక్రవారం అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయిలో జరిగిన కార్యక్రమంలో పోషకాహారం ప్రాధాన్యత, సమతుల్య ఆహారం, పిల్లలు, గర్భిణులు, బాలింతలు, ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం పాత్రపై అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగా యలు, పప్పులు, చిరుధాన్యాల ఆహార పదార్థాలను రోజూవారీ ఆహారంలో తీసుకునేలా కృషి చేయాలన్నారు. పోషణమాసం కార్యక్రమం పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఈ సమావేశంలో అధికారులు ప్రదీప్, హసీనా, ముత్తమ్మ, అలేఖ్య, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
వర్క్‌షాప్‌ను
విజయవంతం చేయాలి
భద్రాచలం: ఐటీడీఏలో అక్టోబర్ 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే 12వ జాతీయ గోండి–కోయ భాష ప్రామాణీకరణ నిఘంటువు వర్క్‌షాప్‌ను విజయవంతం చేయాలని ఏపీఓ(జనరల్) డేవిడ్ రాజ్ సూచించారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులు, కమిటీ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. వర్క్‌షాప్‌నకు తెలంగాణ, ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, అసోం రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది ప్రతినిధులతో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు హాజరవుతారని చెప్పారు. అధికారులు రాంబాబు, వీరూ నాయక్, కమిటీ సభ్యులు నెహ్రూ, కన్నయ్య, రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు.


