ఠాణాలో ఇరువర్గాల ఘర్షణ
కొత్తగూడెంఅర్బన్: గొడవల నేపథ్యంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లోనే పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఠాణాలో విధులు నిర్వరిస్తున్న సిబ్బందికి ఆటంకం కలిగించాయి. త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ ఆదినారాయణ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగూడేనికి చెందిన కొరదల కుమార్, అతని భార్య వినోదకు సంబంధించిన కుటుంబ వివాదం నేపథ్యంలో ఇరువర్గాలవారు త్రీటౌన్‌కు వచ్చారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి పరస్పరం దూషించుకున్నారు. ఒకరిపై మరొకరు దాడులకు పాల్ప డ్డారు. ఇటుకరాయితో దాడిచేయగా దున్నపోతుల రాజు అనే వ్యక్తికి ముక్కుపై గాయమైంది. వెంకటమల్లు అనే మహిళను కొందరు వ్యక్తులు జుట్టు పట్టుకుని, చేతులతో కొట్టారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువర్గాలవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఘర్షణను అదుపు చేసే క్రమంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను సైతం ఇరువర్గాల వారు నెట్టివేశారు. విధులకు ఆటంకం కలిగించారు. కాగా, పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని డీఎస్పీ హెచ్చరించారు.


