పాల్వంచ: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.చందన అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. సిలబస్ పూర్తిపై ఆరా తీశారు. పాఠశాల వంటశాల, సరుకుల స్టోర్ రూం పరిశీలించారు. పరిసరాలతోపాటు మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు టాయిలెట్, బాత్ రూం సౌకర్యం కల్పించాలని కోరగా, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాప్రమాణాలను పెంపొందించాలని సూచించారు. సహాయ సంక్షేమ అధికారి ఎస్.చంద్రమోహన్, హెచ్‌ఎం బి.చెన్నారావు, హెచ్‌డబ్ల్యూఓ ఎ.కల్యాణి, ఉపాధ్యాయులు పి.నర్సయ్య, బి.కిషన్, కె.సురేష్, రఘు, ఎం.గంగ, జ్యోతి, ఆదిలక్ష్మి, సరస్వతి, కళా వతి తదితరులు పాల్గొన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన


