భద్రాచలంఅర్బన్: పట్టపగలు వృద్ధురాలిని మాట లతో ఏమార్చి, కళ్లల్లో కారం కొట్టి, మెడలోని బంగారు గొలుసు లాక్కుని ఉడాయించాడు. ఈ ఘట న పట్టణంలోని కూనవరం రోడ్డులో అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం జరిగింది. స్థానికుల కథ నం ప్రకారం.. కట్టా రామానుజమ్మ అనే వృద్ధురా లు అక్కడి ఓ చిన్న దుకాణంలో కూర్చుని ఉండగా ముఖానికి కర్చీఫ్ కట్టుకుని బైక్‌పై ఓ వ్యక్తి వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడి, కంట్లో కారం కొట్టి మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసు ను లాగాడు. ఆమె గొలుసును గట్టిగా పట్టుకోవడంతో ఒక భాగం చేతిలో ఉండిపోగా, సుమా రు ఏడు గ్రాముల బంగారం ఉన్న మరో భాగం తీసుకుని దుండగుడు బైక్‌పై పరారయ్యాడు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితురాలు తెలిపింది. 100 ద్వారా సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలా న్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.
బంగారు గొలుసు అపహరించిన దుండగుడు


