పాల్వంచరూరల్ : వన్యప్రాణి సంరక్షణకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అటవీ కలప నరికివేత, రవాణా, వన్యప్రాణి వేటపై నిఘా పెంచాలని జిల్లా అటవీశాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ఆదేశించారు. వైల్డ్‌లైఫ్ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వన్యప్రాణి ఆవాసాలు, నీటి వనరులు, సున్నిత ప్రాంతాలు, అక్రమ వేటకు అవకాశం ఉన్న ప్రదేశాలు, అటవీ నేరాల నియంత్రణ, అడవిలో అగ్నిప్రమాదాల నివారణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించడంతోపాటు అనుమానాస్పద కదలికలు, వేట ఉచ్చులు, విద్యుత్ తీగలను గమనించాలన్నారు. కిన్నెరసాని అటవీ ప్రాంతంలో వన్యప్రాణి స్వేచ్ఛాయుత సంచారానికి అనుకూల పరిస్థితులు కల్పించాలనానరు. సమావేశంలో ఎఫ్‌డీఓ బి.బాబు, రేంజర్లు కనకమ్మ, కవిత మాధురి, జ్యోత్స్నదేవి, కిరణ్‌కుమార్, కిషన్ పాల్గొన్నారు.
డీఎఫ్‌ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్


