22వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం | - | Sakshi
Sakshi News home page

22వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

రుద్రంపూర్‌/మణుగూరు టౌన్‌/సత్తుపల్లి రూరల్‌: రుద్రంపూర్‌: రెండు రోజులు కురుస్తున్న వర్షాలతో సింగరేణి కొత్తగూడెం రీజియన్‌లో 22 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లోని గనుల్లో నీరు నిలవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఇక సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో వ58 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే, సింగరేణి వ్యాప్తంగా 18 ఓసీల్లో రోజుకు 13లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌(ఓబీ) తీయాల్సి ఉండగా, 3 లక్షల క్యూబిక్‌ మీటర్లకే పరిమితమైంది. కాగా, వర్షం కారణంగా ఓసీల్లోని క్వారీల్లో నిలిచిన నీటిని అధికారులు ప్లాన్‌టూన్‌ పంపుల ద్వారా బయటకు తోడేస్తున్నారు.

డిజిటల్‌ క్రాప్‌ సర్వేను

వేగవంతం చేయాలి

బూర్గంపాడు: క్షేత్రస్థాయి పరిశీలనతో డిజిటల్‌ క్రాప్‌ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు సూచించారు. బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర గ్రామంలో జరుగుతున్న డిజిటల్‌ క్రాప్‌ సర్వేను గురువారం పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సర్వేలో నమోదైన వివరాల ఆధారంగానే పంటల అమ్మకాలు, ప్రభుత్వ పథకాలకు అవకాశాలుంటాయన్నారు. ఏఈఓలు తమ పరిధిలో సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, అందుకు రైతులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శంకర్‌, ఏఈఓలు వైష్ణవి, పవన్‌, శృతి రైతులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌, ఆదివాసీల మధ్య వాగ్వాదం..

దుమ్ముగూడెం: మండలంలోని చెరుపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులతో ఆదివాసీలు వాగ్వాదానికి దిగిన సంఘటన ఇది. చెరుపల్లి వై జంక్షన్‌లో అనుమతులు లేకుండా భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నారని గ్రామస్తులు గత రెండు రోజుల క్రితం తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యాన గురువారం విచారణకు వచ్చిన తహసీల్దార్‌తో గిరిజనులు వాగ్వాదానికి దిగారు. షెడ్యూల్‌ ప్రాంతంలో 1/70, పీసా చట్టానికి వ్యతిరేకంగా షాపుల నిర్మాణం ఆపాలని అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ నుంచి నిర్మాణం చేపట్టొద్దని నోటీసులు ఇచ్చినా అక్రమంగా రాత్రి పూట మట్టి తోలాకాలు చేస్తున్నారని, తక్షణమే నిర్మాణాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెల్లం రామకృష్ణ, కొత్తపల్లి సర్పంచ్‌ కొర్సా దుర్గామ్మ, కోయనర్సాపురం సర్పంచ్‌ కొర్సా అర్జున్‌, మాజీ ఉపసర్పంచ్‌ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

కేయూ పరిధిలో

నేటి పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో శుక్రవారం జరగాల్సిన దూరవిద్య డిగ్రీ, పీజీ, రెగ్యులర్‌ లా తదితర పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యాన గురువారం కూడా పరీక్షలు వాయిదా వేశామని పేర్కొన్నారు. మిగిలిన పరీక్షలు టైంటేబుల్‌ ప్రకారం యథావిధిగా జరుగుతాయని, 24, 25 తేదీల పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement