జూలూరుపాడు(సుజాతనగర్): ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. గురువారం సుజాతనగర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యసేవలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వాహణ, ప్రజలకు అందుతున్న ఆరోగ్యసేవలను పరిశీలించారు. వైద్యసిబ్బందికి పలు సూచనలు చేయడంతో పాటు ఈడీడీ క్యాలెండర్‌ను క్రమంతప్పకుండా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏఆర్‌వీ, ఏవీ, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని ఫార్మసిస్ట్‌కు సూచించారు. ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలు నిల్వ ఉండేలా చూడాలన్నారు. కుటుంబ నియంత్రణ కార్నర్‌ను అవసరమైన సమాచారంతో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓ–సీహెచ్‌ఐ డాక్టర్ బి.ప్రతాప్, డీసీఎంఓ మోహన్, సీహెచ్‌ఓ నాగభూషణం, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్


