పాల్వంచరూరల్: మండల పరిధిలోని దంతలబోరు ఎస్సీకాలనీని బుధవారం రాత్రి గాలీవాన విధ్వంసం సృష్టించింది. 10 విద్యుత్ పోల్స్ విరిగిపడగా, చెట్లు విరిగిపడి పది ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంతో పాటు బండ్రుగొండ, గొళ్లగూడెం, దంతలబోరు, సంగం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ ఏఈ రవీందర్ గురువారం సిబ్బందితో కలిసి కొత్త పోల్స్, వైర్లను అమర్చి విద్యుత్‌ను పునరుద్ధరించారు. అలాగే ఎంపీడీఓ పి.రాజారావు దంతలబోరు ఎస్సీకాలనీ గ్రామాన్ని సందర్శించి జరిగిన నష్టాన్ని సంబంధిత శాఖల అధికారుల ద్వారా వివరాలను నమోదు చేయించారు. ఈక్రమాన బాధిత కుటుంబాలను పలు పార్టీల నాయకులు పరామర్శించి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు.


