టేకులపల్లి: జిల్లావ్యాప్తంగా రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డుల జారీ కోసం ఫార్మర్ ఐడీ నమోదు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబురావు తెలిపారు. టేకులపల్లి మండలం సులానగర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్‌ను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 30వరకు గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నందున రైతులు ఏఈఓలను కానీ మీ సేవ కేంద్రాల్లో కానీ ఆధార్ కార్డు, భూమి పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో సంప్రదించాలని చెప్పా రు. ఈ నంబర్ ఆధారంగా రైతులకు ప్రభు త్వ ప్రయోజనాలు సులభంగా అందుతాయని తెలి పా రు. పంటలను కనీస మద్దతు ధరతో విక్రయించుకోవడంతో పాటు ఎరువుల కొనుగోలు, బ్యాంకుల రుణాలు పొందడానికి ఐడీ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికే నమోదు చేసుకున్న రైతులు నిర్దేశిత లింక్ ద్వారా ఆధార్ నంబర్ నమోదు చేస్తే ‘రైతు ఐడీ’ పొందొచ్చని డీఏఓ తెలిపారు. ఏడీఏ జి.లాల్‌చంద్, ఏఓ ఎన్.అన్నపూర్ణ, ఏఈఓ భాగ్యశ్రీ పాల్గొన్నారు.


