పకడ్బందీగా భూముల రీసర్వే | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా భూముల రీసర్వే

Sep 23 2026 12:43 AM | Updated on Sep 23 2026 12:43 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): భూములకు సంబంధించి భవిష్యత్‌లో వివాదాలు ఎదురు కాకుండా భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. రామవరం రెవెన్యూ పరిధి సుజాతనగర్‌ – రామవరం – గరీబ్‌పేట ట్రై జంక్షన్‌ వద్ద జరుగుతున్న సర్వేను మంగళవారం ఆయన పరిశీలించారు. రెవెన్యూ పరిధిలో 1,950 ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే గ్రామ సరిహద్దుల నిర్ధారణ, అటవీ భూముల హద్దుల పరిశీలన పూర్తయిందని అధికారులు తెలి పారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని సరేనంబర్లలో పట్టా, అసైన్‌, అటవీ భూములు కలిసి ఉన్నందున హద్దులను రికార్డుల ఆధారంగా స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. అటవీ భూముల హద్దులు ఇప్పటికే తేలిన చోట్ల రీ సర్వే త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. అలాగే, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు కలిగిన వ్యక్తుల భూములకు రీ సర్వే ద్వారా స్పష్టమైన హద్దులు వెల్లడించాలని ఆదేశించారు. కొత్తగూడెం తహసీల్దార్‌ పుల్లయ్య, ఉద్యోగులు అశోక్‌, గణపతి తదితరులు పాల్గొన్నారు.

రామవరంలో పరిశీలించిన కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement