గంటకు వంద పరీక్షలు ! | - | Sakshi
Sakshi News home page

గంటకు వంద పరీక్షలు !

Sep 23 2026 12:43 AM | Updated on Sep 23 2026 12:43 AM

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రక్త పరీక్షలు నిర్వహంచేందుకు నూతన యంత్రాన్ని కేటాయించారు. క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌కు రూ. 3.75 కోట్ల విలువైన ఆటోమెటిక్‌ బయోకెమిస్ట్రీ అనలైజర్‌ మిషన్‌ను కేటాయించగా సెంట్రల్‌ ల్యాబ్‌లో అమరుస్తున్నారు. రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ నరేందర్‌ తెలిపారు. బయోకెమిస్ట్రీ అనలైజర్‌ మిషన్‌ ద్వారా గంటకు వంద శాంపిళ్లను పరీక్షించవచ్చని, వేయి రకాల రక్త పరీక్షలు చేయొచ్చని వెల్లడించారు. లివర్‌, కిడ్నీ పనితీరు పరీక్షలు, గ్లూకోజ్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌, ఎంజైమ్స్‌, ప్రోటీన్స్‌ తదితర పరీక్షల నివేదికలు కచ్చితత్వంతో వస్తాయని తెలిపారు. ఇన్నాళ్లు ఎక్కువగా రక్త నమూనాలను డయోగ్నస్టిక్‌ హబ్‌కు పంపిస్తుండగా, అక్కడి యంత్రాలు మొరాయిస్తుండడంతో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యాన కొత్త యంత్రం రావడంతో కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.

ఖమ్మం పెద్దాస్పత్రికి ఆటోమెటిక్‌ బయోకెమిస్ట్రీ అనలైజర్‌ మిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement