జాతీయ రహదారిపై గుంతలు పూడ్చివేత | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై గుంతలు పూడ్చివేత

Sep 21 2026 12:32 AM | Updated on Sep 21 2026 12:32 AM

పాల్వంచరూరల్‌: వివిజయవాడ–జగదల్‌పూర్‌ (30వ నంబర్‌) జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పూడ్చివేశారు. మండల పరిధిలోని రంగాపురం నుంచి నవభారత్‌ వరకు బీసీఎం జాతీయ రహదారి ‘హైవేపై అన్నీ గుంతలే’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో జాతీయ రహదారుల శాఖ అధికారులు స్పందించారు. పట్టణం పరిధిలోని సీ కాలనీ గేటు నుంచి ఆరోగ్యమాత చర్చి వరకు హైవేపైన ఉన్న ప్రమాదకరమైన గుంతలను పూడ్చారు. కంకర, తారుతో మరమ్మతులు నిర్వహించారు.

ఉరివేసుకుని

వ్యక్తి ఆత్మహత్య

పెనుబల్లి: మనస్థాపంతో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లంకా శేషయ్య బంజర గ్రామానికి చెందిన గొరిపత్తి నాగేశ్వరావు (40) భార్య ఇటీవల చనిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. వీరికి ఒక కుమారుడు. ఈనేపథ్యాన ఆదివారం గ్రామం పరిధిలోని ఆయిల్‌ఫామ్‌ తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న వీఎం బంజర ఎస్సై షేక్‌.షాకీర్‌ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ షాకీర్‌ విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement