విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Sep 21 2026 12:32 AM | Updated on Sep 21 2026 12:32 AM

పాల్వంచరూరల్‌: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం కాగా సుమారు రూ.10లక్షల విలువైన ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలిలా.. పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగులోని మహమ్మద్‌ ముబీన్‌కు చెందిన ఇంట్లో ఎవరు లేని సమయాన శనివారం రాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో ఇంట్లో నుంచి మంటలు ఎగిసి పడటంతో చుట్టు పక్కల ప్రజలు భయాబ్రాంతులకు గురికాగా ప్రమాదంలో కుమార్తె వివాహం కోసం కొనుగోలు చేసిన దుస్తులు, కుమారుడు, కుమార్తెలకు చెందిన ఎంబీఏ సర్టిఫికెట్లతో సహా సుమారు రూ.10లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమా దం జరిగిన సమయంలో ముబీన్‌ పాల్వంచలో ఉండగా అతని భార్య సిద్దిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లింది. అగ్నిప్రమాద విషయాన్ని స్థానికులు ముబీన్‌కు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా అగ్నిమాపక శకటం వచ్చే సరికి మంటలను అదుపుచేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆస్తినష్టాన్ని అంచనా వేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఇంటి యజమాని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement